వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పొంగులేటితో పాటు సమీక్షలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు నరేందర్రెడ్డి.. వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్పై చర్చించారు. వరంగల్ భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలను ప్రస్తావించారు.