మొసళ్ల వేట చాలా భయానకంగా ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కొలనులో చాలా మొసళ్లు వేట కోసం ఎదురుచూస్తుంటాయి. ఓ పంది నీళ్లు తాగేందుకు కొలను ఒడ్డు నుంచి కాస్త కిందకు దిగుతుంది. అయితే వాటిలో ఓ మొసలి నీటిలోంచి ఒక్కసారిగా పైకి లేచి పందిని ఒక్క తోపు తోసేస్తుంది. దీంతో మిగతా మొసళ్లన్నీ పందిని చుట్టుముట్టి దాడి చేస్తాయి.