AP: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఓ వ్యక్తిని గన్‌తో కాల్చారు. నాగిరెడ్డి అనే వ్యక్తిపై రివాల్వర్‌తో లక్ష్మీకాంత్ రెడ్డి, శివ కాల్పులు జరిపారు. నాగిరెడ్డి తలలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పులివెందులలోని ఆటో నగర్ సమీపంలో వైఎంసీ క్లబ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.