కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 22న బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. నేటితో ఈ పథకానికి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'నేటితో బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు. గత దశాబ్ద కాలంలో ఇది ఒక కీలక పరివర్తన, ప్రజల ఆధారిత చొరవగా మారింది' అని పోస్ట్ చేశారు. అయితే ఈ పథకం ముఖ్య ఉద్దేశం సమాజంలో లింగ అడ్డంకులు, పక్షపాతాలను అధిగమించడమే.