టీఎంసీ కంటే బీజేపీకి ఓటేయడం బెటర్‌!: కాంగ్రెస్ నేత

57చూసినవారు
టీఎంసీ కంటే బీజేపీకి ఓటేయడం బెటర్‌!: కాంగ్రెస్ నేత
ఇండియా కూటమిలో భాగస్వామ్యులైన కాంగ్రెస్, టీఎంసీ.. పశ్చిమబెంగాల్‌లో మాత్రం ప్రత్యర్థులుగా విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర రంజన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. టీఎంసీకి ఓటేయడం కంటే బీజేపీకి వేయడం మంచిదని ఆయన అన్నారు. దీంతో బీజేపీకి కాంగ్రెస్ రాష్ట్ర నేతలు బీ-టీమ్‌గా పనిచేస్తున్నారని టీఎంసీ మండిపడింది. ఈ వ్యవహారాన్ని చల్లబర్చేందుకు టీఎంసీ తమ మిత్రపక్షమంటూ కాంగ్రెస్ సర్ధిచెప్పుకుంటోంది.

సంబంధిత పోస్ట్