హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్రచారం చుట్టూ వివాదం చెలరేగింది. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తే కేసులు పెడుతున్న పోలీసులు.. మెట్రోలోని యాడ్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పౌరులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెటిజెన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ యాడ్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.