శృంగారం మనిషికి మానసిక ప్రశాంతత, ఆనందాన్నిస్తుంది. అందుకే శృంగారం ఒక గొప్ప వరంగా చాలా మంది భావిస్తారు. కానీ శృంగారంలో పాల్గొనే సమయంలో కొంత మంది స్త్రీలు అసౌకర్యానికి గురవుతుంటారు. దీనికి ప్రధాన కారణం శృంగారం చేసే సమయంలో స్త్రీ యోనిలో బాధాకరమైన నొప్పి తలెత్తడమే. ఇది స్త్రీకి చిరాకు తెప్పించడమే కాకుండా క్రమంగా శృంగారం పట్ల అనాసక్తికి దారితీస్తుంది. అయితే, చాలా మంది పురుషులకు కఠినమైన శృంగారం చేసే అలవాటు ఉంటుంది. దీనితోనే ఎక్కువ ఆనందాన్ని పొందగలమని వారు భావిస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల స్త్రీకి నొప్పి కలిగే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. తద్వారా వారిలో శృంగారం చాలా అసౌకర్యంగా మారి, శృంగారం పట్ల నిర్లిప్తత ఏర్పడుతుంది. అంతేకాక, కఠినమైన శృంగారం భరించలేని తిమ్మిరి లేదా వేదనను కలిగించి క్రమంగా నొప్పికి దారితీస్తుంది. ఒకవేళ, మీరు కూడా ఇటువంటి బాధాకరమైన, కఠినమైన శృంగారంతో బాధపడుతుంటే మీ భాగస్వామితో మాట్లాడి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. లేదా, శృంగారం తర్వాత ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వీటిని అనుసరించండి.
లూబ్రికెంట్స్ వాడడం: మృదువైన శృంగారానికి ఇది నిజంగా చాలా ముఖ్యమైనది. యోని ప్రదేశంలో వచ్చే నొప్పిని నివారించడానికి ఇది గొప్ప మార్గంగా చెప్పవచ్చు. మీ యోని సరిగ్గా సరళత కానప్పుడు, శృంగారం సమయంలో జరిగే రాపిడితో చర్మం కిందకు చిరిగిపోయి నొప్పి వస్తుంది. అది చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇటువంటి అసౌకర్యం కలిగినప్పుడు లూబ్రికెంట్స్ వాడితే అది మీ శృంగార ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ఇది అక్కడి చర్మాన్ని తేమగా చేసి నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
కఠినమైన శృంగారం వద్దు: కఠినమైన శృంగారం శరీరానికి ఉత్తేజాన్నిస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, ఈ రకమైన శృంగారం యోనికి బాధ కలిగిస్తుంది. తరచుగా, కఠినమైన శృంగారం చేయడం వల్ల స్త్రీలలో యోని పొడి బారడం, సరళత తగ్గడం, తీవ్రమైన ఘర్షణతో సున్నితమైన చర్మం చిరిగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల కాలిన గాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అందువల్ల శరీరంలో ఉద్రేకం, సహజ సరళతను ప్రేరేపించడానికి ఫోర్ ప్లే మార్గాన్ని అనుసరించండి. ఈ ప్రక్రియతో అక్కడ ఏర్పడే తీవ్రమైన గాయాలను అరికట్టవచ్చు.
రబ్బరు కండోమ్ లు వాడొద్దు: కొంతమంది పురుషులు శృంగారంలో రబ్బరుతో తయారు చేసిన కండోమ్ లను ఉపయోగిస్తుంటారు. ఇది స్త్రీ యోనిలో నొప్పికి దారి తీస్తుంది. తద్వారా శృంగారం సమయంలో స్త్రీలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీ భాగస్వామి కూడా ఇటువంటి రబ్బరు కండోమ్ ల పట్ల అసహనంగా ఉంటే గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. రబ్బరు కండోమ్ లకు చాలా ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించడం ద్వారా మీ శృంగారాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చు.
కొంతకాలం దూరంగా ఉండడం: కఠినమైన శృంగారం చేయడం వల్ల యోని ప్రదేశంలో నిరంతరం దురద వస్తుంటే.. ఇది క్రమంగా స్త్రీ సున్నితమైన భాగాలకు హాని కలిగిస్తుంది. అనగా ఇది స్త్రీలలో ఈస్ట్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎస్టీడీలు లేదా ఎస్టీఐలు వంటి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. అందువల్ల, దీన్ని ముందుగానే గుర్తించి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సరైన మందులు తీసుకోండి. ఈ సందర్భంలో కొంతకాలం శృంగారానికి దూరంగా ఉండడం మంచింది. ఇలా చేయడం మూలాన మీ శృంగారంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి: భాగస్వాములతో బలమైన బంధాన్ని కొనసాగించాలంటే శృంగారం మంచి ఔషధంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, శృంగారం సమయంలో మీరు మీ యోని లేదా ప్రైవేట్ భాగాలలో శారీరక అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటే లేదా ఆ అసౌకర్యాన్ని మీరు స్వంతంగా పరిష్కరించలేకపోతే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం. వారి సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటూ మీ సమస్యలను పరిష్కరించుకోండి. దీంతో యోనిలో తలెత్తే అసౌకర్యం లేదా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తద్వారా మీ భాగస్వామితో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించొచ్చు.