స్వాతీ మాలీవాల్‌ కేసులో బిభవ్‌ ముంబయికి తరలింపు

61చూసినవారు
స్వాతీ మాలీవాల్‌ కేసులో బిభవ్‌ ముంబయికి తరలింపు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీ మాలీవాల్‌‌పై దాడి చేసిన కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌‌ను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముంబై తీసుకెళ్లింది. అతడు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తన ఐఫోన్‌ను ఫార్మాట్‌ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫార్మాట్ చేసిన ఐఫోన్‌లోని డేటాను సేకరించడానికి వారు ముంబైకి వెళ్లారు. కాగా ఈ ఘటనలో సీన్ రీక్రియేషన్ చేసి వాంగ్మూలం రికార్డ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్