భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు

84చూసినవారు
భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.300లకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం రూ.700 పలికిన మటన్ దర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుంది. మండీ మార్కెట్ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయడంతో ధరలు భారీగా పెరిగాయి. కోళ్ల దాణా ధరలు పెరగడంతో పాటు వేసవి తీవ్రత నేపథ్యంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్