అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. దేశ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన లేఖ రాశారు. బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తనకు బదులుగా ఆయన కమలా హారిస్‌ను అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.