ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT/PET ఈవెంట్లు రేపటి( Dec 30) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఈవెంట్లు కొనసాగనున్నాయి. ఈవెంట్లకు ఎంపికైన వారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే గడువు ఇవాల్టితో ముగిసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 (ఉ.10-సా. 6) సమయంలో నంబర్లను సంప్రదించండి.