AP: పసిబిడ్డలు ఓ భాష నేర్చుకుంటున్నామని తమకు తెలియకుండానే, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మాతృభాషతో మమేకమైతే తెలివితేటలు పెరుగుతాయన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన మాట్లాడారు. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నారు. తన మాతృభాష మరాఠీ అయినా.. తెలుగులోనే చదువుకున్నట్లు వివరించారు. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందన్నారు.