తమిళ సినిమాలు అంటేనే అందులో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. 2024లో వచ్చిన విజయ్ సేతుపతి మహారాజా, శివ కార్తికేయన్ హీరోగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన అమరన్, దళపతి విజయ్ గోట్, రజినీకాంత్ వేట్టయన్, వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో నటించిన విడుతలై 2, కార్తీ, అరవిందస్వామి నటించిన సత్యం శివం, గరుడన్, బ్లూ స్టార్, హాట్ స్పాట్ వంటి చిత్రాలు ప్రేక్షుకులను బాగా ఆకట్టుకున్నాయి.