సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బూత్ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా నియామకం జరుగనున్న నేపథ్యంలో ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. నవంబర్ 27న రాష్ట్రస్థాయి కార్యశాల, వచ్చే నెలలో జిల్లాస్థాయి కార్యశాలలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశముంది.