హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం కులు జిల్లాలోని బంజర్ లోయ తాండి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో దాదాపు 20 చెక్క ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం 30 కుటుంబాలకు చెందిన 100 మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు చెక్కతో ఉండడంతో పగటిపూట మంటలు వేగంగా వ్యాపించాయి. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీసీపీ తోరుల్ ఎస్ రవీష్ తెలిపారు.