TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలోని షాకింగ్ ఘటన జరిగింది. భగత్ సింగ్ సెంటర్లో నాయుడు హోటల్‌ను నూతనంగా బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా బిర్యాని ప్రియులకు నాయుడు హోటల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అంటూ ఆఫర్ ఇవ్వడంతో ఉదయం నుండే హోటల్ వద్ద బారులు తీరారు. బిర్యానీ కూడా రుచికరంగా ఉండటంతో జనం ఎగబడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.