తన డెలివరీ ఏజెంట్ల సమస్యల్ని తెలుసుకునేందుకు ఇటీవల జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఈ క్రమంలో ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. గురుగ్రామ్ లోని ఓ మాల్‌లో ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లగా.. మాల్ సిబ్బంది ఆయన్ని లిఫ్ట్‌లోకి అనుమతించలేదు. దీంతో 3 అంతస్తులు మెట్లెక్కి వెళ్లానని, తిరిగి మెట్ల ద్వారానే కిందకి వచ్చినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.