జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ హర్యానాలోని గురుగ్రామ్‌లో డెలివరీ బాయ్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండో ఆర్డర్‌ను తీసుకునేందుకు మాల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. తనను మెట్ల మార్గంలో వెళ్లమని సూచించారని చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో మరింత దగ్గరగా పనిచేయాల్సి ఉందనే విషయం దీనిద్వారా అర్థమైందని తెలిపారు.