కర్ణాటక నేత, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్‌ను బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా యడియూరప్ప కుమారుడిని ఎన్నుకోవడంపై బాహాటంగా ఆరోపణలు చేశారు. అలాగే యడియూరప్పపై కూడా విమర్శల చేశారు. తాజాగా నటి రన్యారావు విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అగ్ర నాయకత్వం చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.