సొంత పార్టీ కార్యకర్తను తన్నిన బీజేపీ నేత.. వీడియో వైరల్

73చూసినవారు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నిమగ్నయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, కేంద్ర సహాయమంత్రి రావుసాహెబ్ చేసిన పనిపై విమర్శలొస్తున్నాయి. ఫోటో దిగే క్రమంలో ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాడనే కారణంతో ఓ కార్యకర్తను ఆయన కాలితో తన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సొంత కార్యకర్తనే తన్నేంత అహంకారం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మహాయుతిలో భాగంగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్