ఆస్ట్రేలియాలో బీజేపీ నేత కుమారుడు అనుమానస్పద మృతి

51చూసినవారు
ఆస్ట్రేలియాలో బీజేపీ నేత కుమారుడు అనుమానస్పద మృతి
ఆస్ట్రేలియాలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ ఉద్యోగరీత్యా భార్యతో కలిసి సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజులుగా కనపించకుండా పోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే అతని మృతదేహం సముద్రతీరంలో లభ్యం కావడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్.. షాద్ నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ తనయుడు. 12 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్