హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతు హామీల సాధన దీక్ష’ కొనసాగుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు 24 గంటల దీక్ష చేపట్టారు. 'అర్ధరాత్రి 2 దాటినా రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతోంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు’ అని ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలంగాణ బీజేపీ Xలో పోస్ట్ చేసింది.