తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వ తీరుపై ఆయన ఇలా నిరసన తెలిపారు. చొక్కా విప్పి కొరడాతో పలుమార్లు కొట్టుకున్నారు. మరోవైపు డీఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై గురువారం శపథం చేసిన విషయం తెలిసిందే.