జోమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన వినియోగదారుల కోసం ఈఎంఐ చెల్లింపు సౌకర్యాన్ని గురువారం ప్రారంభించింది. రూ. 2,999 కంటే ఎక్కువ ఆర్డర్‌లు చేసేవారికి ఈఎంఐ సౌకర్యాన్ని కల్పించింది. అయితే బంగారం, వెండి కొనుగోళ్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. కాగా, ICICI, HDFC, SBI, AXIS, RBL, కోటక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కలిగిన వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.