ఫోన్‌ను నిరంతరం వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఫోన్ నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి చర్మానికి హాని కలిగిస్తుంది. దీనిని బ్లూలైట్ అని పిలుస్తారు. నీలి కాంతికి గురికావడం వల్ల చర్మానికి రంగును ఇచ్చే సహజ చర్మ వర్ణద్రవ్యం మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మెలనిన్ అధిక ఉత్పత్తి చర్మంపై నల్ల మచ్చలకు దారి తీస్తుంది. అలాగే చర్మంపై ముడుతలను కూడా కలిగిస్తుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది. కళ్ళపై ప్రభావం చూపిస్తుంది.