మణిపూర్‌లో మైతేయ్-కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. ఈ క్రమంలో కొయిరెంగేయ్ ప్రాంతంలో సీఎం బీరేన్ సింగ్ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారుజామున స్థానికులు ఓ మోర్టార్ బాంబును గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. అయితే ఘటన సమయంలో సీఎం ఆ ఇంట్లో లేరని సమాచారం.