సికింద్రాబాద్- జవహర్నగర్ పరిధిలోని CRPF పాఠశాలల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న CRPF స్కూళ్లకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం, విద్యార్థులను క్షేమంగా వారి వారి ఇళ్లకు తరలిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీబీ మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.