దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు

75చూసినవారు
దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహణిలో పేలుడు ఘటన మరువకముందే మరోసారి సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగుడు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఉదయం 11 గంటల్లోగా అన్ని పాఠశాలలను ఖాళీ చేయాలని అన్నాడు. కాగా, ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్