'ఆకాశ' విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

60చూసినవారు
'ఆకాశ' విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆకాశ ఎయిర్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఉదయం 186 మంది ప్రయాణికులతో ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1719 ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా బాంబు ఉన్నట్టు కెప్టెన్‌‌కు సెక్యూరిటీ అలెర్ట్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్