జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు

67చూసినవారు
జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు
జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పూణె నుంచి జమ్మూతావికి వెళ్తున్న 11077 జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలు స్లీపర్‌ కోచ్‌లో బాంబు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రైలులో తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. అనంతరం బాంబు ఉందన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్