జ‌న‌సేన అభ్య‌ర్థి ఉద‌య్‌పై అన‌ర్హ‌త క‌త్తి..!

570చూసినవారు
జ‌న‌సేన అభ్య‌ర్థి ఉద‌య్‌పై అన‌ర్హ‌త క‌త్తి..!
జ‌న‌సేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్య‌ర్థి.. తంగెళ్ల‌ ఉద‌య్ శ్రీనివాస్‌పై అన‌ర్హ‌త క‌త్తి వేలాడుతోంది. ఆయ‌న త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా బాగానే శ్ర‌మిస్తున్నారు. అయితే.. ఎటొచ్చీ.. ఉద‌య్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో ఆయ‌న‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల‌ను దాచార‌నేది.. వైసీపీ చెబుతున్న మాట‌. ఇదే విష‌యాన్ని కేంద్ర హోం శాఖ‌, విదేశాంగ శాఖ‌ల దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఉద‌య్ దాఖ‌లు చేసిన నామినేష‌న్‌ను తిర‌స్క‌రించేలా చూడాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్టు స‌మాచారం.

సంబంధిత పోస్ట్