ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. దీనిపై శాసనమండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయన ఇటీవల ఎన్నికయ్యారు. ఆ తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. ఆ స్థానంలో బొత్సను పార్టీ అధినేత జగన్ నియమించారు. YSRతో పాటు జగన్ హయాంలోనూ బొత్స మంత్రిగా పని చేశారు.