ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన బాటిల్ మూత, పల్లి గింజ

63చూసినవారు
ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన బాటిల్ మూత, పల్లి గింజ
TG: కూల్ డ్రింక్ బాటిల్ మూత మింగి ఓ చిన్నారి, పల్లి గింజ గొంతులో ఇరుక్కుని మరో బాలుడు ప్రాణాలు కోల్పోయారు.  మంచిర్యాల జిల్లా ఊట్కూర్‌లో రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి చనిపోగా, మహబూబాబాద్ జిల్లా నాయక్‌పల్లిలో అక్షయ్(18 నెలలు) గొంతులో పల్లీ ఇరుక్కుని ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాగా చిన్నారుల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని, అనుక్షణం గమనిస్తూ ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్