గుజరాత్‌లోని సూరత్‌లో ఓ బాలుడిని సబ్ ఇన్‌స్పెక్టర్ చితకబాదారు. ప్రధాని మోదీ శనివారం సూరత్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు నగరంలో ప్రధాని కాన్వాయ్ రిహార్సల్స్ చేపట్టారు. అయితే అదే సమయంలో బాలుడు సైకిల్ తొక్కుతూ సడెన్‌గా రోడ్డుపై వచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆ బాలుడిని కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడిపై చేయి చేసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.