తెలంగాణలో కాంగ్రెస్ ఉచిత బస్సు స్కీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు సుమారు 34 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోయారని తెలుస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బాజర్ హత్నూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ భగత్ సంతోష్(36) రూ.4 లక్షలు అప్పు తీర్చలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ మృతితో కుటుంబం రోడ్డున పడింది. ఏపీలోనూ ఉచిత బస్సు పథకం అమలైతే వీరిపై తీవ్ర ప్రభావం చూపనుంది.