జూన్ 30 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

56చూసినవారు
జూన్ 30 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. వేసవి సెలవులు, పోలింగ్‌ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 30-40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్‌ 30వ తేదీ వరకు వారాంతాల్లో (శుక్ర, శని, ఆది) వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.

సంబంధిత పోస్ట్