ఫెంగల్ తుఫాన్ ఏపీ, తమిళనాడు తీరం వైపు పయనిస్తోంది. దీంతో వాతావరణ శాఖ ఏపీ, తమిళనాడులకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీని ప్రభావంతో తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.