కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీలో దిక్కు లేదని అన్నారు. కాంగ్రెస్‌కు భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. దేశాభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఈజీగా ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.