ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో బ్రిటిష్‌కు చెందిన ఓ పర్యాటకుడు ట్రెండింగ్ అవుతున్నాడు. భారత సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు వచ్చానని అతను తెలిపారు. తాను ఈ కుంభమేళాను పరిశీలించేందుకు 36 గంటలపాటు సరిగా నిద్రకూడా పోలేదని తెలిపారు. త్రివేణీ సంగమంలో స్నానం చేసినట్లు చెప్పారు. చాలా గొప్పగా, సంతోషంగా, ఇక్కడి సాధువులను చూస్తే ఎంతో గౌరవంగా ఉందని అన్నారు.