‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా HYD ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు పీఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని పేర్కొన్నారు. ఇదే ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.