ప్రమాదంలో పక్కటెముకలు విరిగిపోయాయి: సల్మాన్ ఖాన్

58చూసినవారు
ప్రమాదంలో పక్కటెముకలు విరిగిపోయాయి: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం గురించి సల్మాన్ తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తనకు సికిందర్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగిందని, తన పక్కటెముకలు విరిగిపోయాయని పేర్కొన్నారు. తనకు తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. బిగ్ బాస్ 18వ సీజన్‌‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ గాయంపై అభిమానులు ఆందోళనగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్