శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి శ్రీశైలానికి 1.64 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.4 అడుగులు ఉంది. శ్రీశైలం గరిష్ఠ నిల్వ 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.9 టీఎంసీలు ఉంది.