డెడ్ బట్ సిండ్రోమ్ అనేది పిరుదులలో బలహీనమైన, క్రియారహితమైన గ్లూటియస్ మెడియస్ కండరాల వల్ల వచ్చే రుగ్మత. ఎక్కువసేపు కూర్చోవడం, డ్రైవింగ్ చేయడం లేదా తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇది తరచుగా జరుగుతుంది. మోకాళ్లకు గాయాలు కావడం, తుంటి నొప్పి, వెన్ను దిగువ భాగంలో నొప్పి వంటి అనేక రకాల సమస్యలకు ఇది దారితీయవచ్చని వైద్య నిపుణులు చెప్పారు.