చాలా మంది బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతుంటారు. తొందరగా జీర్ణం అవుతుందని భావిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు పేర్కొంటున్నారు. బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే కడుపులోని ఎంజైమ్‌లు సరిగ్గా పని చేయవు. ఒక్కోసారి త్రేన్పులు అధికమై, ముక్కులోకి గ్యాస్ తన్నుకొస్తుంది. ఒక్కోసారి ఇది ప్రమాదంగా పరిణమిస్తుంది. అంతేకాకుండా ఇతర ఉదర సమస్యలు తలెత్తవచ్చు.