అప్పు చెల్లించలేదని.. అన్న, వదినను కట్టేసిన తమ్ముడు (వీడియో)

82చూసినవారు
తీసుకున్న అప్పు చెల్లించలేదని సొంత తమ్ముడే అన్నావదినలను కట్టేశాడు. సిద్దిపేట పట్టణంలో ఉండే దొంతరబోయిన పర్శరాములు అవసరాల నిమిత్తం తన తమ్ముడు కనకయ్య వద్ద రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. రూ.లక్ష తీర్చగా మిగిలిన రూ.20 వేలతోపాటు వడ్డీ ఇవ్వాలని కనకయ్య అడిగాడు. శుక్రవారం పంచాయితీ కోసం కౌన్సిలర్‌ ఇంటికి వెళ్లగా అక్కడ గొడవ పడటంతో వారిని పంపించేశారు. దీంతో పర్శరాములు దంపతులను కనకయ్య లాక్కొచ్చి కట్టేశారు. దీంతో స్థానికులు వారిని విడిపించి కనకయ్యను మందలించారు.

సంబంధిత పోస్ట్