తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో BRS రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొత్తగూడెంలోని పూసుగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాము ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తెలంగాణపై అప్పుల భారం మోపిందన్నారు.