నల్గొండలో ఆదివారం బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కల్గించవద్దని మహాధర్నాను వాయిదా వేసినట్లు తెలిపారు. మహాధర్నాను ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.