వైడ్‌ బంతుల నిబంధనల్లో ఐసీసీ మార్పులు?

52చూసినవారు
వైడ్‌ బంతుల నిబంధనల్లో ఐసీసీ మార్పులు?
క్రికెట్‌లో వైడ్ బంతుల నిబంధనల్లో మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. బౌలర్లకూ బెనిఫిట్‌ దక్కేలా మార్పులు చేయాలని ICC భావిస్తోందని ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు షాన్‌ పొలాక్ వెల్లడించాడు. వన్డేలు, టీ20ల్లో బౌలర్ల ఏకాగ్రతను దెబ్బకొట్టేలా బ్యాటర్లు క్రీజ్‌లో మూమెంట్స్‌ ఇస్తుంటారు. అలాంటప్పుడు బౌలర్‌ బంతిని స్టంప్స్‌కు కాస్త దూరంగా వేస్తాడు. అలాంటి వాటిపైనా అంపైర్లు దృష్టి పెట్టనున్నట్లు పొలాక్ తెలిపాడు.

సంబంధిత పోస్ట్