BRS నేతల నిరసనపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. నిరసనల్లో BRS ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప కేటీఆర్, హరీశ్‌రావు వేసుకోలేదని విమర్శించారు. అందులోనూ వారి దొరతనం బయటపడిందని అని ఎద్దేవా చేశారు. 'నిరసనలో కూడా BRS నేతల్లో సమానత్వంలేదు. రైతులకు బేడీలు వేయడంపై BRS నేతలకు మాట్లాడే అర్హత లేదు. వారి హయంలోనే రైతులకు దాదాపు 10 సార్లు బేడీలు వేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.