శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటిలో ఇవాళ పార్టీ సమావేశానికి బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్నకౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజాను గృహనిర్బంధం చేశారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.